హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్న 'గేమ్ ఛేంజర్'

by సూర్య | Tue, Feb 20, 2024, 04:16 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ని స్టంట్ డైరెక్టర్లు అన్‌బరివ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు సమాచారం.

అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, హ్యారీ జోష్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. 2024 సమ్మర్‌లో ఈ సినిమా పెద్ద స్క్రీన్‌లపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM