by సూర్య | Tue, Feb 20, 2024, 03:39 PM
తిరుపతిరావు ఇండ్ల దర్శకత్వంలో అభినవ్ గోమతం ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ఫిబ్రవరి 23, 2024న విడుదల కానుంది. ఫిబ్రవరి 20న అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లాన్ లో జరుగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వరుణ్ తేజ్ రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ సినిమాలో అభినవ్ గోమతం సరసన వైశాలి రాజ్ జంటగా నటించింది. ఈ చిత్రాన్ని కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకంపై భవానీ కాసుల, ఆరెంరెడ్డి, ప్రశాంత్ వి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అలీ రెజా, మోయిన్, నిజల్గల్ రవి, ఆనంద చక్రపాణి, తరుణ్ భాస్కర్, రవీందర్ రెడ్డి, లావణ్య రెడ్డి, జ్యోతి రెడ్డి, సూర్య, రాకెట్ రాఘవ, శ్వేత అవస్తి, సాయి కృష్ణ, ఫణి చంద్రశేఖర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. శామ్యూల్ అబీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.