ధనుష్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్ ఖరారు

by సూర్య | Tue, Feb 20, 2024, 02:56 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అభిమానులలో చాలా హైప్ మరియు అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకి 'రాయన్' అనే టైటిల్ ని లాక్ చేసినట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసారు.

ఈ సినిమాలో విష్ణు విశాల్, దుషార విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్ మరియు SJ సూర్య కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ధనుష్ పవర్ ఫుల్ క్యామియోలో కనిపించనున్నాడు. నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు Sun, Jan 12, 2025, 09:13 PM
'మజాకా' ఆన్ బోర్డులో ప్రముఖ నటి Sun, Jan 12, 2025, 09:07 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'గరివిడి లక్ష్మి' ఫస్ట్ సింగల్ Sun, Jan 12, 2025, 09:03 PM
'నాగబంధం' నుండి రుద్రా లుక్ ని లాంచ్ చేయనున్న రానా Sun, Jan 12, 2025, 08:59 PM
23 ఏళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న నాగ్ హీరోయిన్ Sun, Jan 12, 2025, 08:51 PM