భీమా : గల్లీసౌందుల్లో సాంగ్ ప్రోమో అవుట్

by సూర్య | Tue, Feb 20, 2024, 02:49 PM

కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'భీమా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి గల్లీసౌందుల్లో సాంగ్ ప్రోమోని విడుదల చేసారు. ఈ పూర్తి సాంగ్ రేపు విడుదల కానుంది.

ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో గోపీచంద్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో యువ తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ప్రేమ, జీవితంపై రెజీనా కాసాండ్రా ఆసక్తికర వ్యాఖ్యలు Sat, Apr 18, 2026, 02:28 PM
క్యాన్సర్‌తో మలయాళ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ కన్నుమూత Sat, Apr 18, 2026, 12:05 PM
హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు.. అదితి పోస్ట్ వైరల్ Sat, Apr 18, 2026, 11:18 AM
ప్రేక్షకుల కోరిక మేరకు 'ఓ అందాల రాక్షసి' రీ-రిలీజ్ Sat, Apr 18, 2026, 10:44 AM
అనాథాశ్రమంలో పెరిగి.. పానీపూరితో ఆకలి తీర్చుకున్న హీరోయిన్ Fri, Apr 17, 2026, 02:36 PM