దర్శకురాలిగా మారనున్న బిగ్ బాస్ కంటెస్టెంట్

by సూర్య | Tue, Feb 20, 2024, 01:43 PM

అప్పుడెప్పుడో భానుమతి, ఆ తర్వాత సావిత్రి, విజయ నిర్మల ఆపై బి జయ, ఇప్పుడు నందినీ రెడ్డి,సుధ కొంగ‌ర వంటి వాళ్లు ఇలా తరానికి ఒక్కరిద్ద‌రు లేడీ డైరెక్టర్స్ వ‌స్తుంటారు. ఏ ఇండస్ట్రీలో అయినా అంతే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. లేడీ డైరెక్టర్స్ చాలా మంది వస్తూ మెగా ఫోన్ పట్టి తమ ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి చూపిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కొందరు లేడీ డైరెక్టర్స్ వచ్చి సత్తా చూపించి విజయాలు కూడా అందుకున్నారు. అలా మొదలైది, కల్యాణ వైభోగమే, ఓ బేబీ సినిమాలను డైరెక్ట్ చేసి నందిని రెడ్డి మంచి దర్శకురాలు అనిపించుకున్నారు. అలాగే 2021 యేడాదిలో ‘వరుడు కావలెను’ సినిమాతో లక్ష్మీ సౌజన్య... ఆ తర్వాత విడుదలైన ‘పెళ్లి సందD’ సినిమాతో గౌరీ డైరెక్టర్స్ పని చేశారు. ఆకాశ‌మే హ‌ద్దురా వంటి సినిమాతో మ‌న తెలుగమ్మాయి సుధా కొంగ‌ర దేవ వ్యాప్తంగా పేరు సంపాదించుకుంది. తాజాగా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన, తెలుగు బిగ్‌బాస్‌2 కంటెస్టెంట్ సంజన అన్నే కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతోంది. సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బాబు కొల్లబాతుల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ ఉదగండ్ల ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రచన, దర్శకత్వం సంజన అన్నే నిర్శ‌హిస్తోంది.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM