బేబీ బంప్ కి ముద్దుపెడుతున్న ఫోటో షేర్ చేసిన వరుణ్ ధావన్

by సూర్య | Tue, Feb 20, 2024, 11:52 AM

 ప్రముఖ బాలీవుడ్ హీరో తండ్రి కాబోతున్నాడు. స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించిన ఆహీరో.. సోషల్ మీడియాపోస్ట్ ద్వారాతన ఆనందాన్ని పంచుకున్నాడు.  బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. తాను త్వరలో తండ్రి కాబోతున్నట్టు ప్రకటించాడు.  నాన్న అని పిలిపించుకోబోతున్నారు. వరుణ్. ఈ విషయంలో తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు వరుణ్ దావన్. సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్, తన స్నేహితురాలు, గర్ల్ ఫ్రెండ్ అయిన నటాషా దలాల్ ని 2021 లో పెళ్ళాడాడు  వరుణ్ దావణ్. పెళ్లి తరువాత ఓమూడేళ్ల పాటు.. హ్యాపీగా ఎంజాయ్ చేసిన ఈ జంట.. తాజాగా తల్లీతండ్రులు కాబోతున్నారు. ఈ సెలబ్రిటీ కపుల్స్.. తమ లైఫ్ లోకి మొదటి బేబీకి వెల్కమ్ చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో.. వరుణ్ దావణ్ సోషల్ మీడియాలోఓ పోస్ట్ పెట్టారు.  తన భార్య నటాషా బేబీ బంప్ కి ముద్దుపెడుతున్న ఫోటోను శేర్ చేశారు వరుణ్ దావణ్. ఈ విధంగా రాశారు..  “మేము తల్లిదండ్రులు కాబోతున్నాము. మాకు మీ అందరి ప్రేమ, అశీసులు కావాలి” అంటూ రాసుకొచ్చాడు యంగ్ హీరో.  ఇక ఈ పోస్టు పై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా రియాక్ట్ అవుతున్నారు. సమంత స్పెషల్ గా వీరికి విషెస్ తెలియజేశారు. బాలీవుడ్ స్టార్స్  రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అర్జున్ కపూర్, ప్రియాంక చోప్రా,కరీనా కపూర్,  అలియా భట్, సమంత, బిపాసా.. కియారా అద్వానీ,  లాంటి  స్టార్స్ అంతా వరుస కామెంట్స్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక వరుణ్ బాలీవుడ్ లో బిజీగా ఉన్నాడు. అట్లీ సినిమాలో నటిస్తున్నాడు వరుణ్. దాంతో పాటు   సిటాడెల్ వెబ్ సిరీస్ తో మరోసారి తెలుగువారిని పలకరించబోతున్నారు. సమంత, వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సిటాడెల్ సిరీస్.. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.


 


 

Latest News
 
నేడు మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. రూ.99కే సినిమా చూసే ఛాన్స్‌ Fri, Sep 20, 2024, 10:27 AM
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM