విజయ్ దేవరకొండ నిహారికను పెళ్లి చేసుకుంటున్నాడా ?

by సూర్య | Thu, Mar 21, 2019, 05:31 PM

నిజమా.. విజయ్ దేవరకొండ మెగా ఇంటి అల్లుడు కాబోతున్నాడా.. ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ న్యూస్ విని షాక్ అవుతున్నారు. ఎక్కడినుంచి పుట్టిందో తెలియదు కానీ విజయ్ దేవరకొండ, నిహారిక పెళ్లి విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్నట్టు.. ఇందులో నిజం కూడా లేకపోలేదని నమ్ముతున్నారు అభిమానులు.

ఇక్కడ మరో చిన్న ట్విస్ట్ కూడా ఉంది. గతంలో నిహారిక పెళ్లి తొలి సినిమా ఒక మ‌న‌సు హీరో నాగశౌర్యతో జరుగుతుందంటూ ప్రచారం జరిగింది. పైగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు కూడా కొన్ని రోజులు వినిపించాయి. అందుకే అప్పుడు ఛ‌లో ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి వచ్చాడని ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత అవన్నీ రూమర్లే అని తేలిపోవడంతో ఆ టాపిక్ అక్కడితో ముగిసిపోయింది. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత విజయ్ దేవరకొండతో నిహారిక పెళ్లి జరుగుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

పైగా విజయ్ దేవరకొండ.. అల్లు అరవింద్ భార్య తరపు బంధువులు అని తెలుస్తోంది. దాంతో ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కలుపుకుంటున్నారనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది. కానీ గతంలో ఉదయ్ కిరణ్ విషయంలో కూడా ఇదే జరిగింది. అప్పుడు చిరంజీవి పెద్ద కూతురుతో నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది. దాంతో అప్పటి నుంచి మెగా కుటుంబంతో సంబంధం అంటే హీరోలు కూడా భయపడుతున్నారు. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అస‌లు ఈ వార్త‌ల్లో నిజ‌మెంత ఉందో తెలియాలంటే కూడా ముందు ఎవ‌రో ఒక‌రు క్లారిటీ ఇవ్వాలి.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM