స్టైలిష్ స్టార్ తల్లిగా టబు.......

by సూర్య | Thu, Mar 21, 2019, 06:08 PM

త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలోని పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. అందుకే ఆయన చిత్రాల్లో కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. ఉదాహరణకు ‘అత్తారింటికి దారేది’ సినిమానే తీసుకోండి. అందులో హీరో అత్త పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే నధియా లాంటి సీనియర్ హీరోయిన్‌ను ఆ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. ఆమె కూడా ఆ పాత్రకు 100 శాతం న్యాయం చేశారు. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ కి తల్లిగా ఒప్పటి హాట్ హీరోయిన్ టబును తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే టబుకు ఇంకా త్రివిక్రమ్ కథ చెప్పలేదట. త్వరలోనే త్రివిక్రమ్ ఆమెను కలిసి కథ చెబుతారని తెలుస్తోంది. బన్నీ – త్రివిక్రమ్ సినిమా అంటే టబు ఒప్పుకోకుండా ఉంటుందా. మొత్తానికి తెలుగు ప్రేక్షకులు టబును త్వరలో తల్లిగా చూడబోతున్నారు. టబుకి జోడిగా ఈ సినిమాలో సత్యరాజ్ నటించనున్నారు.

కాగా ఈ చిత్రం కథ విషయానికి వస్తే తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. గతంలో బన్ని- త్రివిక్రమ్ కలిసి చేసిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కూడా తండ్రి కొడుకుల మధ్య కథే. అయితే ఆ కథలో చనిపోయిన ఫాదర్ ఎమోషన్ని పట్టుకొని కొడుకు జర్నీ ఉంటుంది.

Latest News
 
'మనమే' టీజర్ అవుట్ Fri, Apr 19, 2024, 02:25 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'పోకిరి' Fri, Apr 19, 2024, 02:24 PM
ఛార్మి లేటెస్ట్ లుక్ Fri, Apr 19, 2024, 02:17 PM
రోడ్డు ప్రమాదానికి గురైన బుల్లితెర నటి Fri, Apr 19, 2024, 01:43 PM
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ Fri, Apr 19, 2024, 01:42 PM