'సైంధవ్‌' రెండవ సింగిల్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Sat, Dec 09, 2023, 06:47 PM

శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ హీరో వెంకటేష్ తన 75వ సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సైంధవ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని డిసెంబర్ 11న విడుదల చేయనున్నట్లు అధికారకంగా సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ లో బేబీ సారా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్, రుహాని శర్మ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13, 2024న థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM