ఫన్నీమీమ్ : టాలీవుడ్ ఇమ్రాన్ హష్మి విజయ్ దేవరకొండ.....

by సూర్య | Tue, Mar 19, 2019, 04:23 PM

విజయ్ దేవరకొండ... ఇప్పుడు  అతను యూత్ కి ఒక ఐకాన్. అతని స్టైల్, యాక్టింగ్ , ఆటిట్యూడ్ కొంత మందికి ప్రేరణ. అతను ఏది చేసిన ఒక సెన్సేషన్ అవుతుంది.

'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు దేవరకొండ. అక్కడి నుండి అతను వెనుకకు చూసుకునే సమయమే దొరకట్లేదు.' గీతగోవిందం' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన కథలో వేసుకున్నాడు. చివరగా వచ్చిన' టాక్సీవాలా' తో డీసెంట్ హిట్ కొట్టాడు . తెలుగు సినిమాల్లో పెదవి ముద్దుల్ని సాధారణీకరించిన ఘనత అతడికే దక్కుతుంది. ‘అర్జున్ రెడ్డి’లో షాలిని పాండేతో అతను ఎన్ని లిప్ లాక్స్ చేశాడో లెక్కే లేదు. ఐతే ఆ సినిమా స్థాయిలో కాకపోయినా.. వేరే చిత్రాల్లో కూడా అతను లిప్ లాక్స్ లాగిస్తూనే వస్తున్నాడు. ‘ద్వారక’లో పూజా జవేరితో.. ‘గీత గోవిందం’లో రష్మిక మందన్నాతో.. ‘నోటా’లో ఓ ఫారిన్ బ్యూటీతో విజయ్ పెదవి ముద్దులు లాగించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘డియర్ కామ్రేడ్’లో మరోసారి రష్మిక మందన్నాతో లిప్ లాక్ చేశాడు. ఇది చాలా ఇంటెన్స్‌గా ఉండి టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఈ విషయంలో దేవరకొండ  విజయ్ ను టాలీవుడ్ ఇమ్రాన్ హష్మికి అభివర్ణిస్తున్నారు నెటిజన్లు. హష్మి.. దేవరకొండను తన తమ్ముడిగా చూపిస్తున్నట్లు ఒక మీమ్ తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. హష్మి లాగే విజయ్ లిప్ లాక్స్ విషయంలో చూపించే ఈజ్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మిగతా తెలుగు స్టార్లలో చాలా మంది ఒక్కసారి కూడా లిప్ లాక్ సీన్ చేయలేదు కానీ.. విజయ్ మాత్రం ప్రతి సినిమాలో పెదవి ముద్దులు లాగించేస్తుండటం విశేషమే. ‘అర్జున్ రెడ్డి’లో అతను అన్నేసి ముద్దులు పెట్టేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM