మహిళ ఆత్మహత్య కేసులో 'పుష్ప' సినిమా నటుడు అరెస్ట్

by సూర్య | Wed, Dec 06, 2023, 10:46 PM

'పుష్ప' మూవీలో హీరో అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్రలో కనిపించిన నటుడు జగదీష్ (కేశవ్)ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.  ఓ జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉండగా ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడిన అభియోగంపై అతడిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగదీష్ వేధింపులు తాళలేక పంజాగుట్టలో నివాసముంటున్న ఓ మహిళ గత నెల 29న ఆత్మహత్య చేసుకుంది. గత నెల 27న బాధితురాలు ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో జగదీష్ ఫొటోలు తీశాడు. ఆ తర్వాత ఫొటోలను సోషల్‌మీడియాలో పెడతానని బెదిరించడంతో ఆవేదనకు గురైన బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది.ఈ కేసులో పరారీలో ఉన్న జగదీష్‌ను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM