‘ఈగల్‌’ నుండి పాట విడుదల

by సూర్య | Wed, Dec 06, 2023, 11:45 AM

రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఈగల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకుడు. టి.జి.విశ్వ ప్రసాద్‌ నిర్మాత. కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మంగళవారం ఈ చిత్రం నుంచి ‘ఆడు మచ్చా’ అనే గీతాన్ని విడుదల చేశారు. దావ్‌జాంద్‌ స్వర పరచిన గీతమిది. రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. కల్యాణ చక్రవర్తి రాశారు. శేఖర్‌ నృత్య రీతులు సమకూర్చారు. ‘‘మాస్‌ బాణీ ఇది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించాం. రవితేజ వేసే స్టెప్పులు అభిమానుల్ని అలరిస్తాయి. ఇందులో రవితేజ విభిన్నమైన షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నార’’ని చిత్రబృందం తెలిపింది. మధుబాల, నవదీప్‌ కీలక పాత్రలు పోషించారు.

Latest News
 
రష్మికకు సెక్యూరిటీ పెంపు.. కారణం ఏంటంటే? Thu, Oct 24, 2024, 08:18 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 24, 2024, 07:41 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ Thu, Oct 24, 2024, 07:38 PM
'కంగువ' ఆడియో లాంచ్ కి వెన్యూ ఖరారు Thu, Oct 24, 2024, 07:33 PM