'యానిమల్‌' గురించి నువ్వు మాట్లాడొచ్చా ... త్రిషా ?

by సూర్య | Wed, Dec 06, 2023, 11:44 AM

చెన్నై బ్యూటీ త్రిష ఈ మధ్యన వార్తల్లో నిలిచి వైరల్‌ అయింది. మన్సూర్‌ అలీఖాన్ ఆమెపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. త్రిష మరోసారి వార్తల్లో నిలిచింది. ఆదివారం రాత్రి 'యానిమల్‌' సినిమా గురించి ఓ పోస్ట్‌ చేసి ట్రోలింగ్‌కు గురైంది. 'యానిమల్‌'  గురించి ఒక్క పదంలో.. కల్ట్‌  సినిమా అని ప్రశంసిస్తూ ఇనస్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేసింది. దీంతో నెట్టింట ఫ్యాన్స్  ఆమెను ఓ రేంజ్‌ లో ఆడుకున్నారు. ఇటీవల మన్సూర్‌ అలీ ఖాన్  చేసిన కామెంట్‌లకు ఫెమినిస్ట్‌ కామెంట్స్‌ చేసిన త్రిష.. ఇప్పుడు యానిమల్‌ మూవీకి ఇలాంటి రివ్యూ ఇవ్వడమేంటని సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు. నువ్వు అసలైన స్త్రీవాదివేనా? మహిళలను దారుణంగా అవమానించిన ఇలాంటి సినిమాను పొగుడుతావా? అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. నువ్వో నకిలీ ఫెమినిస్ట్‌ వంటూ ఆమెను టార్టెగ్‌ చేశారు. మన్సూర్‌   అలీఖాన్   విషయంలో త్రిషకు అండగా నిలిచిన నెటిజన్లే ఇప్పుడు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. ఇప్పుడు స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆమెకు పోస్ట్‌ విపరీతంగా వ్యతిరేకత రావడంతో త్రిష తన పోస్ట్‌ను డిలీట్‌ చేసింది. ఈ ఏడాది పొన్నియిన్‌ సెల్వన్‌ - 2, ది రోడ్‌, లియో చిత్రాలతొ ఆకట్టుకున్న త్రిష ఇప్పుడు విదాముచార్చి, థగ్‌ లైఫ్‌ సినిమాలు చేస్తోంది. 

Latest News
 
రష్మికకు సెక్యూరిటీ పెంపు.. కారణం ఏంటంటే? Thu, Oct 24, 2024, 08:18 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 24, 2024, 07:41 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ Thu, Oct 24, 2024, 07:38 PM
'కంగువ' ఆడియో లాంచ్ కి వెన్యూ ఖరారు Thu, Oct 24, 2024, 07:33 PM