25 మిలియన్ వ్యూస్ ని సాధించిన 'సుట్టంలాసూసి' లిరికల్ పాట

by సూర్య | Tue, Dec 05, 2023, 06:45 PM

కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన తదుపరి చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 8, 2023న విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలోని సుట్టంలాసూసి లిరికల్ పాట యూట్యూబ్‌లో 25 మిలియన్ వ్యూస్ ని సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం పోస్టర్ విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM