ఈగిల్ : యూట్యూబ్ ట్రేండింగ్ లో 'ఆడు మచ్చ' సాంగ్ ప్రోమో

by సూర్య | Tue, Dec 05, 2023, 06:04 PM

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమ్నేనితో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి ఈగిల్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన "ఆడు మచా" అనే మొదటి సింగిల్ ప్రోమోను ఆవిష్కరించిన చిత్ర బృందం సంగీత ప్రమోషన్‌లను ప్రారంభించింది. దేవ్‌జాంద్ కంపోజ్ చేసిన ఆడుమచా పాట ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో టాప్ ట్రేండింగ్ లో ఉంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈరోజు సాయంత్రం 6:03 గంటలకు పూర్తి పాట విడుదల కానుంది.

ఈ చిత్రం 13 జనవరి 2024న విడుదల కానుంది. థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM