by సూర్య | Mon, Dec 04, 2023, 07:59 PM
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన పాన్-ఇండియా యాక్షన్ డ్రామా యానిమల్ సినిమా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద $6 మిలియన్లను క్రాస్ చేసింది. యానిమల్ నార్త్ అమెరికాలో అనేక హాలీవుడ్ చిత్రాలను అధిగమించి 7వ స్థానంలో నిలిచినట్లు సమాచారం.
ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక రణబీర్‌తో రొమాన్స్ చేయనుంది. రణబీర్ కపూర్ ఈ సినిమాలో ఇంటెన్సివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ అండ్ సినీ1 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.