'రత్నం' సినిమా టీజర్‌ విడుదల

by సూర్య | Mon, Dec 04, 2023, 12:01 PM

విశాల్ హీరోగా నటిసున్న చిత్రం 'రత్నం'. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి హరి దర్శకత్వం వహించారు.  ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించారు. తాజాగా ఈ చిత్రం టైటిల్‌తో పాటు, ఫస్ట్ షాట్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ  టీజర్ ప్యూర్ గూస్ బంప్స్ స్టఫ్‌లా అనిపించింది.  బ్యాక్ డ్రాప్,  సెటప్, దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆర్ఆర్, కత్తితో తల నరికేయడం, విశాల్ మాస్ అవతారం ఇలా అన్నీ కలిసి ఈ ఫస్ట్ షాట్ టీజర్‌ను అద్భుతం అనేలా చేశాయి. ‘కన్నీరే నెత్తురు చిందగా.. క్రోదమే రుధిరం చిమ్మగా.. ఆగ్రహమే అరుణధారగా.. రణరంగమే రక్తపు ఏరుగా’ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే మాటలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. తలని నరికిన రక్తంతో టైటిల్ పేరు రావడం, ఆ రక్తమే రత్నం అనే టైటిల్‌గా మారడం మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు వివేక్ పాటలు రాశారు. ఎం సుకుమార్ కెమెరామెన్‌గా పని చేశారు. విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ఈ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తారు. 

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM