'యానిమల్' మొదటి రోజు కలెక్షన్ రిపోర్ట్

by సూర్య | Sun, Dec 03, 2023, 03:20 PM

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' సినిమా థియేటర్లలో విడుదలైంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఎక్కువగా ఈ సినిమా సెకండాఫ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సినిమాలో విపరీతమైన హింస, అడల్ట్ కంటెంట్ ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

లేటెస్ట్ ట్రేడ్ ప్రకారం, ఈ సినిమా హిందీ వెర్షన్ నుంచి తొలిరోజు 54 కోట్ల నెట్ వసూలు చేసింది. డబ్బింగ్ వెర్షన్లు మరో 9 కోట్ల నెట్‌ని వసూళ్లు చెయ్యగా ఈ సినిమా దేశీయ మార్కెట్‌లో 63 కోట్లకు చేరుకుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది.


అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ, చారు శంకర్, బబ్లూ పృథ్వీరాజ్ మరియు శక్తి కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ మరియు మురాద్ ఖేతాని నిర్మించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM