చీరలో ఈషా రెబ్బా సోయగాల విందు

by సూర్య | Fri, Dec 01, 2023, 04:14 PM

హీరోయిన్ ఈషా రెబ్బా చీరలో సోయగాల విందు చేసింది. నడుము వంపులు కనిపించేలా ఘాటైన పోజుల్లో గుండెల్లో పాగా వేసింది. ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఈషాకు కాలం కలిసిరాలేదు. కెరీర్ ని నిలబెట్టే ప్రాజెక్ట్ దక్కలేదు. అందుకే ఆమె లైమ్ లైట్లో లేకుండా పోయింది. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తోంది. తెలుగులో ఈషాకు ఆఫర్స్ తగ్గాయి. ముఖ్యంగా హీరోయిన్ ఆఫర్స్ రావడం లేదు. ఇటీవల ఈషా దయ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తి భార్య అలివేలు పాత్రలో ఆమె కనిపించారు. ప్రెగ్నెంట్ లేడీగా నటించి మెప్పించారు. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న దయ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. దర్శకుడు పవన్ సాధినేని దయ సిరీస్ రూపొందించాడు.  ఆ మధ్య ఓ  తమిళ ప్రాజెక్ట్ ప్రకటించింది. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ అధికారుల పాత్రలు చేస్తున్నారట.కోలీవుడ్ లో ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని ఈషా రెబ్బా భావిస్తుంది. ఈ క్రమంలో బందిపోటు, ఓయ్, అమీ తుమీ, దర్శకుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈషాకు భారీ కమర్షియల్ హిట్ పడకపోవడం మైనస్ అయ్యింది. అదే సమయంలో  వివక్ష కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. తెలుగులో కన్నడ, మలయాళ, హిందీ భామల హవా నడుస్తుంది. ఇదే విషయాన్ని ఈషా రెబ్బా ఇటీవల కుండబద్దలు కొట్టారు. తెలుగు అమ్మాయిలకు తెలుగులో ఆఫర్స్ ఇవ్వడం లేదని వాపోయారు. వేరే పరిశ్రమల్లో టాలీవుడ్ గురించి గొప్పగా మాట్లాడుతుంటే గర్వంగా ఉంటుంది. కానీ తెలుగు అమ్మాయిలకు ఇక్కడ అవకాశం ఇవ్వరంటూ ఓపెన్ అయ్యారు. ఈషా రెబ్బా కామెంట్స్ వైరల్ అయ్యాయి. హీరోయిన్ ఈషా రెబ్బా చీరలో సోయగాల విందు చేసింది. నడుము వంపులు కనిపించేలా ఘాటైన పోజుల్లో గుండెల్లో పాగా వేసింది. ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 


 


 


 





Latest News
 
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM