60 ఏళ్ల వృద్ధురాలిగా మారిన తాప్సి

by సూర్య | Sun, Mar 17, 2019, 06:12 PM

తాప్సి పన్ను పుట్టింది ఢిల్లీ లో అయిన టాలీవుడ్ హీరోయిన్ గానే తనకు పేరుంది. తెలుగులో చాల సినిమాలు చేసి ఇప్పుడు బాలీవుడ్ కి చెక్కేసింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ విమర్శకుల ప్రసంశలు పొందుతుంది. ప్రస్తుతం తాప్సీ ఎంపికలు అభిమానులకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి .

ప్రస్తుతం తాప్సి 60 ఏళ్ల వృద్ధురాలిగానటిస్తుండడం అభిమానుల్లో ప్రముఖంగా చర్చకు వచ్చింది. 28 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి 60 సంవత్సరాల వయసు వృద్ధురాలిగా నటించడమా? అంటూ అందరిలో ఒకటే ఆశ్చర్యం. అయితే అందుకు తగ్గట్టే తన రూపాన్ని ఆహార్యాన్ని మార్చుకుని తాప్సీ ఇస్తున్న సర్ ప్రైజ్ మామూలుగా లేదు. ఇంతకీ తాప్సీ ఎందుకింత సాహసం చేస్తోంది? ఎవరి పాత్రలో నటిస్తోంది? అంటే ప్రఖ్యాత షార్ప్ షూటర్ చంద్రో తోమర్ పాత్రలో తాప్సీ నటిస్తోంది. చంద్రో తోమర్ షూటర్ దాదీగా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం. లేటు వయసులోనూ తనకు అసాధారణ పాపులారిటీ ఉంది. జాతీయ స్థాయి షూటర్ గా ఎన్నో పతకాల్ని గెలుచుకున్నారు. 15 మంది మనవలు మనవరాళ్లు ఉన్న అమ్మమ్మగానూ చంద్రో తోమర్ ఫేమస్.

తాప్సి తన  పాత్ర గురించి మాట్లాడుతూ.. ఇలాంటి ఓ పాత్రలో నటించడం ఎంతో కష్టం. 60 వయసు వృద్ధురాలిగా ఎమోషన్స్ పండించడం ఛాలెంజ్ తో కూడుకున్నది అని తాప్సీ తెలిపారు. ఇక తాప్సీ తనని తాను అద్దంలో చూసుకుని ఆ ఛేంజోవర్ కి ఆశ్చర్యపోయిందట. ఆన్ లొకేషన్ తాప్సీ గెటప్ చూసి తన తల్లిగారు సైతం అంతే సర్ ప్రైజ్ అయిపోయారట.  వరుసగా ప్రయోగాత్మక పాత్రలు ఎంచుకుని సాహసాలు చేస్తున్న తాప్సీ మరో లెవల్ కి ఎదిగేస్తుందనడంలో సందేహమేం లేదు. అయితే టాలీవుడ్ లో అలా ప్రయోగాలు చేసే దర్శకులెవరూ తాప్సీకి కనిపించకపోవడం వల్లనే ఇటువైపే చూడటం లేదన్నమాట!

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM