కొత్త మెగా హీరో కోసం విజయ్ సేతుపతి

by సూర్య | Sun, Mar 17, 2019, 05:29 PM

చిరంజీవి ఫ్యామిలీ నుండి పదుల సంఖ్యలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో రాబోతున్నాడు. సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ నిర్మాణంలో ఆయన శిష్యుడు బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లనుంది. 

కమెడియన్ సునీల్ హీరోగా తెరకెక్కిన ‘2 కంట్రీస్’లో కథానాయికగా నటించిన మోనికా రాజ్ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో ‘రంగస్థలం’ తరహాలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఇప్పుడు ఓ పెద్ద పేరు వినిపిస్తోంది. ఈ వార్తే నిజమైతే మాత్రం ఈ ప్రాజెక్టుకు వచ్చే క్రేజే వేరు. ఇంతకీ ఆ పేరు ఏంటి అంటారా.. విజయ్ సేతుపతి.

కోలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి.. అద్భుతమైన నటనతో కోట్లాది మంది హృదయాలు గెలిచిన నటుడు విజయ్ సేతుపతి. అతడిని ఈ తరం కమల్ హాసన్ అంటారు. హీరో అయినా.. విలన్ పాత్రయినా.. క్యారెక్టర్ రోల్ అయినా.. విజయ్ చేశాడంటే దాని స్థాయే మారిపోతుంది. ప్రస్తుతం అతను మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగానే వైష్ణవ్ సినిమాలో విలన్ పాత్ర కోసం విజయ్ దగ్గరికి ప్రపోజల్ వెళ్లిందట. 

పాత్ర నచ్చడం, మెగస్టార్ మేనల్లుడి సినిమా కావడంతో అతను ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఆషామాషీ పాత్ర అయితే విజయ్ చేయడానికి ఒప్పుకోడు. కాబట్టి ఆ పాత్ర ప్రత్యేకంగానే ఉండి ఉండాలి. విలన్ పాత్ర బాగుంటే హీరో పాత్రను కూడా అందుకు దీటుగా తీర్చదిద్దాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో కంటెంట్ బలంగానే ఉంటుందని భావిస్తున్నారు.



Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM