'వార్ 2' విడుదలకి తేదీ ఖరారు

by సూర్య | Wed, Nov 29, 2023, 02:24 PM

'వార్ 2' లో సౌత్ ఇండియన్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన వార్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ కాకుండా, యే జవానీ హై దీవానీ మరియు బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి దర్శకత్వం వహించనున్నారు. వార్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్న యష్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పుడు ఈ బిగ్గీ విడుదల తేదీని ప్రకటించింది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ భారీ మల్టీస్టారర్ 2025 ఆగస్టు 14న విడుదల కానుంది అని సమాచారం. ఈ చిత్రం ఒకే రోజు 100 కోట్ల నెట్‌ని వసూలు చేసే అన్ని అవకాశాలను కలిగి ఉన్నట్లు లేటెస్ట్ టాక్. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, మరియు టైగర్ 3 తర్వాత YRF స్పై యూనివర్స్‌లో ఇది ఆరవ చిత్రం. ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ త్వరలో ఈ ప్రాజెక్ట్ పనిని ప్రారంభించనున్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM