'దేవర' టీజర్ అప్‌డేట్

by సూర్య | Tue, Nov 28, 2023, 06:17 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. తాజా అప్‌డేట్‌ ప్రకారం, అందరూ ఎంతో ఆశక్తిగా  ఎదురుచూస్తున్న ఈ సినిమా గ్లింప్సె లేదా టీజర్ వచ్చే సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందని బజ్ మొదలైంది. ఈ వార్తకు సంబంధించి అధికారిక ధృవీకరణ మూవీ మేకర్స్ నుండి రావలిసి ఉంది.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది.ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న‘12th ఫెయిల్' మూవీ Mon, Mar 04, 2024, 10:21 PM
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ టీజర్ రిలీజ్ Mon, Mar 04, 2024, 09:42 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'షైతాన్' Mon, Mar 04, 2024, 08:03 PM
శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించిన 'గామి' బృందం Mon, Mar 04, 2024, 08:01 PM
AVD సినిమాస్ లో ఓపెన్ అయ్యిన 'భీమా' బుకింగ్స్ Mon, Mar 04, 2024, 07:58 PM