షారుక్‌ఖాన్, విజయ్‌తో కలిసి ఓ మల్టీస్టారర్‌ ప్లాన్ చేసిన అట్లీ

by సూర్య | Tue, Nov 21, 2023, 04:15 PM

జవాన్ చిత్రంతో ప్యాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు అట్లీ ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా అట్లీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆయన టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నారట. అయితే దర్శకుడిగా కాదు.. నిర్మాతగా తెలుగు సినిమాలో భాగం కానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ చక్కర్లు కొడుతోంది. ఆయన నిర్మాణ సంస్థ ‘ఏ ఫర్‌ యాపిల్‌ స్టూడియోస్‌’పై నాలుగు సినిమాలు నిర్మించనున్నారట. వాటిలో ఒక తెలుగు సినిమా ఉందని టాక్‌. అంతే కాదు షారుక్‌ఖాన్, విజయ్‌తో కలిసి ఓ మల్టీస్టారర్‌ ప్లాన్ చేశారు అట్లీ. తదుపరి చిత్రం అదేనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అట్లీ స్వయంగా చెప్పారు. అలాగే ఓ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌కు కూడా కథ అందిస్తున్నారు.

Latest News
 
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM
హీరో దర్శన్ కేసుపై స్పందించిన నటుడు Tue, Jun 18, 2024, 10:47 AM
USAలో $200K మార్క్ ని చేరుకున్న 'మహారాజా' Mon, Jun 17, 2024, 10:28 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కల్కి 2898 AD' లోని భైరవ ఎంతమ్ సాంగ్ Mon, Jun 17, 2024, 10:25 PM