రజనీకాంత్‌ మనువడికి జరిమానా

by సూర్య | Tue, Nov 21, 2023, 04:13 PM

హీరో ధనుష్‌ - ఐశ్వర్య రజనీకాంత్‌ పెద్ద కుమారుడు యాత్ర రాజా కు చెన్నై నగర ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా, హెల్మెట్‌ ధరించకుండా సూపర్‌బైక్‌ను డ్రైవ్‌ చేయడంతో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనల కింద రూ.వెయ్యి జరిమానా విధించారు. స్థానిక పోయెస్‌ గార్డెన్‌లోని తన తల్లి వద్ద ఉంటున్న యాత్ర... సహాయకుడితో కలిసి బైక్‌ డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నాడు. అయితే, హెల్మెట్‌ ధరించకుండా, ఎలాంటి లైసెన్స్‌ లేకుండా బైక్‌ నడపడాన్ని ఎవరో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అది పోలీసుల దృష్టికి వెళ్లింది. నెంబర్‌ ప్లేట్‌ ఆధారంగా అది హీరో ధనుష్‌ బైక్‌గా గుర్తించారు. అలాగే, హెల్మెట్‌, లైసెన్స్‌ లేకుండా యాత్ర బైక్‌ నడిపినట్టుగా నిర్ధారించి ఈ అపరాధం విధించారు. దీంతో సూపర్‌స్టార్ రజనీకాంత్ మనవడు, ధనుష్ తనయుడు‌కి జరిమానా అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Latest News
 
అదిరిపోయే అవుట్ ఫిట్లలో కాజల్ అగర్వాల్ Sat, Dec 09, 2023, 10:48 AM
మరోసారి స్పెషల్ సాంగ్ తో తమన్నా Sat, Dec 09, 2023, 10:45 AM
వర్షపు నీటిలో నటి శివానీ నారాయణ్ చిందులు Sat, Dec 09, 2023, 10:13 AM
OTT లో దూసుకుపోతున్న కొత్త చిత్రం Sat, Dec 09, 2023, 10:10 AM
ఉస్తాద్ : మొదటి సెలబ్రిటీ గెస్ట్ గా వస్తుంది ఎవరంటే....! Fri, Dec 08, 2023, 10:05 PM