'ప్రేమిస్తున్నా.. నీ ప్రేమలో జీవిస్తున్నా' సాంగ్ లిరిక్స్‌

by సూర్య | Tue, Nov 21, 2023, 12:07 PM

ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా, ఆ ఆ ఆ

ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే
కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే..
ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా..
మనసున దాచుకుంటనే..

మన కథలాంటి మరో కథా..
చరితలో ఉండదంటనే..
ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ..

ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా, ఆ ఆ ఆ

నువ్వు ఎదురే నిలబడితే
వెలిగెనులే నా కంటి పాపలు
ఒక నిమిషం వదిలెలితే
కురిసేనులే కన్నీటి ధారలు

అపుడెపుడో అల్లుకున్న బంధమిది
చెదరదుగా చెరగదుగా..
మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది
కరగదుగా తరగదుగా..
మరణము లేనిదొక్కటే
అది మన ప్రేమ పుట్టుకే..

ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా, ఆ ఆ ఆ

నను ఎపుడూ మరువనని
పరిచావులే చేతుల్లో చేతిని
నను వదిలి బ్రతకవనీ
తెలిసిందిలే నీ శ్వాస నేనని

నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం
మనసుకదే వరము కదా..
అణువణువు నీలో నన్నే నింపుకోడం
పగటికలే అనవు కదా..
మలినము లేని ప్రేమకి..
నువ్వు ఒక సాక్ష్యమౌ చెలి..

ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా, ఆ ఆ ఆ

ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే
కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే..
ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా..
మనసున దాచుకుంటనే..

మన కథలాంటి మరో కథా..
చరితలో ఉండదంటనే..
ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ…..

Latest News
 
ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘మైదాన్’ మూవీ Wed, May 22, 2024, 01:54 PM
బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్ Wed, May 22, 2024, 11:03 AM
అతడి ప్రవర్తన చూసి భయమేసింది: హీరోయిన్ కాజల్ Wed, May 22, 2024, 10:21 AM
'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్ Tue, May 21, 2024, 08:45 PM
తన సినీ కెరీర్‌ను వదిలేయనున్న స్టార్ హీరోయిన్ Tue, May 21, 2024, 08:43 PM