'మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018' లో విజయ్ దేవరకొండ మొదటి స్థానం

by సూర్య | Thu, Mar 14, 2019, 03:52 PM

టాలీవుడ్ టాప్ హీరోలతో వరసగా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న ఈ నిర్మాణ సంస్థ.. ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోలతో వరసపెట్టి సినిమాలు చేస్తోంది. వీటిలో ఒకటి విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ‘డియర్ కామ్రేడ్’. దక్షిణాదిలో విజయ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను అన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్ టైమ్స్ వారు నిర్వహించిన 'హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు 2018' లో విజయ్ దేవరకొండ మొదటి స్థానంలో నిలిచి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.

టాలీవుడ్లో మహేష్ బాబు..ప్రభాస్.. చరణ్...ఎన్టీఆర్.. అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఎంతో మంది ఉండగా వారందరినీ దాటిసి మొదటి స్థానం దక్కించుకోవడం అంటే మాటలు కాదు.  గత ఏడాది హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో విజయ్ దేవరకొండ రెండవస్థానంలో నిలిచాడు.  ఈ సారి మొదటి స్థానంలో నిలవడం గొప్ప విషయమే.  గత ఏడాది సర్వేలో మొదటి స్థానం సాధించిన మోడల్ బసీర్ అలీ ఈసారి ఐదవ స్థానంలో నిలిచాడు.

మరోవైపు చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు 2018 లో విజయ్ దేవరకొండకు మూడవ స్థానం లభించింది.   అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో కూడా రౌడీగారు తన సత్తా చాటుతున్నారన్నమాట. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM