వైరల్ అవుతున్నడ్యాన్సింగ్ అంకుల్ వీడియో

by సూర్య | Thu, Mar 14, 2019, 04:37 PM

డ్యాన్సింగ్ అంకుల్ గా పేరుగాంచిన సంజీవ్ శ్రీవాస్తవ మరోసారి సంచలనం సృష్టించారు. ఇప్పటివరకు సినీ గీతాలకు డ్యాన్స్ చేసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న శ్రీవాస్తవ ఇప్పుడు తనపైనే చిత్రీకరించిన ఆల్బం సాంగ్ కు అదిరిపోయే రేంజ్ లో నర్తించారు. యూఏఈలో ఉండే మ్యూజిక్ కంపోజర్ జాసిమ్, భారతీయ గాయకుడు బెన్నీ దయాళ్ సంయుక్తంగా రూపొందించిన చాచా నాచ్ అనే పాటలో ఈ డ్యాన్సింగ్ అంకుల్ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫామ్ చేశారు.

ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సాంగ్ లో సంజీవ్ శ్రీవాస్తవ డ్యాన్స్ టాలెంట్ పీక్స్ లో కనిపించింది. తన పదేళ్ల వయసు నుంచే డ్యాన్స్ చేస్తున్న ఈ డ్యాన్సింగ్ అంకుల్ తన బావమరిది పెళ్లిలో డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అక్కడ్నించి సామాజిక మాధ్యమాల్లో డాన్సింగ్ అంకుల్ పేరుతోనే పాప్యులర్ అయ్యాడు. సంజీవ్ శ్రీవాస్తవ ఓ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM