శెరవేగంగా మొదలవుతున్న 'కన్నప్ప'

by సూర్య | Mon, Sep 25, 2023, 04:37 PM

మంచు విష్ణు 'కన్నప్ప' అనే ఒక భక్తిరస సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా శ్రీకాళహస్తిలో అధికారికంగా లాంచ్ చేశారు. ఇప్పుడు మంచు విష్ణు తన సాంఘీక మాధ్యమం అయిన ట్విట్టర్ లో ఈ సినిమా గురించి ఒక సుదీర్ఘ లేఖను పోస్ట్ చేశారు. ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని, దీనికి గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడుతూ వస్తున్నాం అని, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో మొదలయిందని రాసారు. ఏడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నామని, ఎందరినో సంప్రదించామన్నారు, ఇప్పటికి తన కల నెరవేరి షూటింగ్ మొదలెడుతున్నామని అంతా ఆ ఈశ్వరుడు, పార్వతి దేవి కృప అని చెప్పాడు. ఈ సందర్భంగా విష్ణు ఈ ప్రాజెక్ట్ లో తనకి సహాయ సహకారాలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసాడు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM