వారి ఆశీస్సులతోనే ఈ సినిమా తీసాం

by సూర్య | Mon, Sep 25, 2023, 04:11 PM

రాఘవ లారెన్స్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘చంద్రముఖి-2’. పి.వాసు దర్శకుడు. ఈ సినిమాలో కంగనా రనౌత్‌ రాజనర్తకిగా నటించారు. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా లారెన్స్‌ మాట్లాడుతూ.. ‘‘రెబల్‌’ తర్వాత తెలుగులో సినిమాను డైరెక్ట్‌ చేయడం కుదర్లేదు. ‘చంద్రముఖి 2’ ద్వారా మిమ్మల్ని ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. ‘చంద్రముఖి -2’ సినిమా విషయానికొస్తే.. ముందుగా రజనీకాంత్‌కు ధన్యవాదాలు చెప్పాలి. ఆయన నటించిన సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో నేను భాగం కావడం అదృష్టమనే చెప్పాలి. దర్శకుడు పి.వాసు కథ చెప్పగానే రజనీకాంత్‌గారికి ఫోన్‌ చేశాను. ‘అన్నయ్యా.. చంద్రముఖి- 2 సినిమా చేస్తున్నా’ అని చెప్పగానే ఆయన ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఆయన లేకపోతే నేనీ వేదికపై ఉండేవాణ్ని కాదు. ఇంతమంది అభిమానం సొంతం చేసుకున్నానంటే చిరంజీవి మరో కారణం. ఈ సినిమా పనులు జరుగుతున్న సమయంలోనే ఎం.ఎం. కీరవాణికి ‘ఆస్కార్‌’ అవార్డు వచ్చింది. మేమంతా ఎంతో సంతోషించాం. ఈ సినిమా కూడా ఆస్కార్‌ స్థాయికి చేరుకోవాలని దేవుణ్ని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

Latest News
 
'వెట్టయన్' ట్రైలర్ విడుదలకి తేదీ ఖరారు Mon, Sep 23, 2024, 06:56 PM
'సత్యం సుందరం' ట్రైలర్ రిలీజ్ Mon, Sep 23, 2024, 06:51 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్ Mon, Sep 23, 2024, 06:46 PM
'మత్తు వదలారా 2' నుండి మొరాన్ సాంగ్ అవుట్ Mon, Sep 23, 2024, 05:30 PM
VD12: మేజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్ Mon, Sep 23, 2024, 05:24 PM