బోయపాటి తదుపరి సినిమా ఆయనతోనేనా..?

by సూర్య | Sat, Sep 23, 2023, 03:43 PM

మాస్‌ చిత్రాలకి పెట్టింది పేరు దర్శకుడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం రామ్‌ పోతినేనితో ‘స్కంద’ చిత్రంతో బిజీగా ఉన్న ఆయన గురించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. బోయపాటి తదుపరి చిత్రం తమిళ స్టార్‌ సూర్యతో తీయనున్నారట. ఇప్పుడు ఈ వార్త కోలీవుడ్‌ మీడియాలో కోడై కూస్తోంది. వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన సూర్యతో బోయపాటి చిత్రం అంటే అంచనాలు భారీగా ఉంటాయి. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘కంగువా’ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాతే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట. వీరిద్దరి కాంబినేషన్‌ ఎలా ఉండబోతోంది? సూర్యను తెరపై ఎలా ఆవిష్కరిస్తారా? అన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో నెలకొంది. అయితే ఈ చిత్రంపై తెలుగు, తమిళ భాషల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM