వారి కలయిక అందుకోసమేనా..?

by సూర్య | Sat, Sep 23, 2023, 03:41 PM

బాలీవుడ్ చిత్ర హీరో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 'జవాన్' సినిమా విజయం పట్ల అల్లు అర్జున్ కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే, అందులో అందరికీ శుభాకాంక్షలు చెప్పినప్పుడు, సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సమాధాం చెప్పినప్పుడు, పాటలు అదిరిపోవాలి అని అల్లు అర్జున్ అతనికి మళ్ళీ సమాధానం చెప్పాడు. ఈ సమాధానంతో అందరూ అట్లీ తదుపరి సినిమా అల్లు అర్జున్ తో ఉండబోతోందని, దానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అని కూడా ఫిక్స్ అయిపోయారు అర్జున్ అభిమానులు. ఇదిలా ఉండగా ఈరోజు అల్లు అర్జున్ ముంబై వెళ్లి దర్శకుడు అట్లీని కలిసినట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ ముంబై ఎయిర్ పోర్ట్ లో వున్న వీడియోస్ అప్పుడే సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM