కోర్టుల ముందు అందరు సమానమే

by సూర్య | Sat, Sep 23, 2023, 03:37 PM

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు హీరో విశాల్‌ చెల్లించాల్సిన రూ. 21.29 కోట్లను తిరిగి చెల్లించే వ్యవహారం ఇప్పుడు కోర్టులో సాగుతోంది. ఈ కేసుల విచారణలో భాగంగా తొలుత రూ. 15 కోట్లు డిపాజిట్‌ చేయాలని, విశాల్‌ తన ఆస్తుల జాబితాను కోర్టుకు సమర్పించాలంటూ గతంలో హైకోర్టు ఆదేశించింది. కానీ, ఆయన పట్టించుకోలేదు. అదే సమయంలో గత విచారణకు విశాల్‌ లేదా ఆయన తరపు న్యాయవాదులు కూడా హాజరుకాలేదు. దీంతో ఈనెల 22వ తేదీ విశాల్‌ స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది.ఇందులో భాగంగా, శుక్రవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పీటీ ఆషా ... కోర్టు ఆదేశం మేరకు ఆస్తుల జాబితాను సమర్పించని విశాల్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అంటూ ప్రశ్నించారు. విశాల్‌.. కోర్టుల కంటే గొప్ప వ్యక్తిగా తనను తాను ఊహించుకోరాదని, న్యాయస్థానాల విషయంలో ప్రతి ఒక్కరూ సమానమేనని స్పష్టం చేశారు. ఆ సమయంలో విశాల్‌ తరపు న్యాయవాదులు కల్పించుకుని... పూర్తి వివరాలు పొందేందుకు ఆలస్యమైందని, కోర్టు కోరిన దస్తావేజులను గురువారం ఆన్‌లైన్‌లో సమర్పించినట్టు పేర్కొన్నారు. అప్పుడు జోక్యం చేసుకున్న న్యాయమూర్తి.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌లోడ్‌ చేయని పక్షంలో తనను కలవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM