మదరాసి ప్రెసిడెన్సీ నేపథ్యంలో ‘డెవిల్’

by సూర్య | Sat, Sep 23, 2023, 03:36 PM

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న మరో వైవిధ్య చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్‌లైన్. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ ‘మాయే చేసి’ని మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్‌ ల మధ్య ప్రేమను చూపించింది. పాటలో ఇద్దరి కెమిస్ట్రీ ఆకర్షణీయగా ఉంది. 'డెవిల్’ సినిమా 1940లోని మదరాసి ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగుతుంది. అంటే స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్నారు. నాటి కాలాన్ని, నాటి సంగీతాన్ని తెరపై చూపించే క్రమంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా దక్షిణ భారత దేశపు సహజమైన లొకేషన్లను ఎంచుకున్నారు. కారైకుడిలోని ప్యాలెస్‌లో ఈ పాటను చిత్రీకరించారు.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM