భయపడ్డా , కానీ విజయం దక్కింది

by సూర్య | Sat, Sep 23, 2023, 03:33 PM

నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. ఈ సందర్భంగా నవీన్‌ పొలిశెట్టి విలేకరులతో మాట్లాడుతూ......‘‘మిస్‌ శెట్టి విజయం నాలో ఎనలేని ఆత్మ విశ్వాసం నింపింది. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో విడుదలైన చిత్రమిది. ‘జవాన్‌’లాంటి సినిమాతో పోటీకి తట్టుకొంటామా? అనే భయం వేసింది. పైగా చాలాసార్లు విడుదల వాయిదా పడింది. సినిమా విడుదల సమయంలో పొలిటికల్‌ వైబ్స్‌ కూడా సరిగా లేవు. అందుకే ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకొంటారా అనుకొన్నా. కానీ మౌత్‌ టాక్‌ వల్ల ఈ సినిమా అందరికీ చేరువైంది. సినిమా విడుదలై ఇన్ని రోజులైనా వసూళ్లు ఏమాత్రం తగ్గలేదు’’. ‘‘నాతో పని చేసిన దర్శకులంతా నాకు కావల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు. నా ఇన్‌పుట్స్‌ తీసుకొన్నారు. రాసిన దాన్ని నాదైన శైలిలో మార్చుకొని కెమెరా ముందుకు వస్తా. అందుకే ఆయా సన్నివేశాలు అంత ఫ్రెష్‌గా అనిపిస్తాయి’’. ‘‘అన్ని రకాల జోనర్లూ చేయాలని ఉంది. ప్రస్తుతం 3 సినిమాలు లైన్‌లో పెట్టా అని తెలియజేసారు. 

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM