విక్రమ్ 'ధృవ నచ్చతిరమ్' ట్రైలర్ విడుదల అప్పుడేనా?

by సూర్య | Thu, Jun 08, 2023, 08:31 PM

గౌతమ్ మీనన్‌ దర్శకత్వంలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ అధికారకంగా ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ధృవ నచ్చతిరమ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 17న విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ టాక్. అలాగే ట్రైలర్‌తో పాటు రెండు పాటలను కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో విక్రమ్ కి జోడిగా రీతూ వర్మ నటిస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్లర్ చిత్రం జులై 14న విడుదల కానుందని సమాచారం. స్పై థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో జాతీయ భద్రతా ఏజెన్సీ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్లస్ లో విక్రమ్ టీమ్ హెడ్ పాత్రలో కనిపించనున్నాడు.


ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, పార్తీబన్, సిమ్రాన్, రాధిక, దివ్య దర్శిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒండ్రాగా ఎంటర్‌టైన్‌మెంట్, కొండడువోం ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధృవ నచ్చతిరమ్‌కి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.

Latest News
 
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM
జెమినీ టీవీలో రేపటి సినిమాలు Sat, Jul 13, 2024, 05:38 PM
'శివం భజే' రిలీజ్ డేట్ ఖరారు Sat, Jul 13, 2024, 05:37 PM
క్రియేటివ్ ప్రొడ్యూసర్ సీతారామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'డార్లింగ్' టీమ్ Sat, Jul 13, 2024, 05:36 PM