పుష్ప -2 లో మరొక నటుడు

by సూర్య | Wed, Jun 07, 2023, 02:25 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప -2. ఈ సినిమా మెజార్టీ పార్ట్ షూటింగ్ మొత్తం అడవుల్లోనే కావడం చేత సుకుమార్ ముందుగా అవసరమైన సన్నివేశాలను సెట్లోనే తెరకేక్కిస్తూ ఉన్నారు.


ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో విశాఖలోని అటవీ ప్రాంతంలో పలు రకాల సన్నివేశాలు షూటింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మారేడుమిల్లి అడవులకు షిఫ్ట్ అయినట్లుగా తెలుస్తోంద. అక్కడే నటీనటుల పైన కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. మొదటి భాగంలో పుష్పరాజ్-బన్వర్ సింగ్ షేకావత్ పాత్రలు హైలైట్ గా నిలిచాయి.


స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో రెండు పాత్రలు కూడా పుష్ప సినిమాలో హైలెట్గా చూపించారు ఈ నేపథ్యంలోని.. షేకావత్ పాత్రకి ఒక బలమైన సపోర్టింగ్ రోలు తీసుకురాబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. పోలీస్ అధికారి అయిన షేక్షావత్ కింద పని చేసే ఒక కిరాయి గుండా పాత్రలో ఖైదీ చిత్రంలో నటించిన నటుడు అర్జున్ దాస్ ను ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట సుకుమార్ కథలో ఈ పాత్ర లేదట ఆన్ సెట్స్ కి వెళ్ళిన తర్వాత షేకావత్ పాత్రకి బలమైన సపోర్టింగ్ రోలు ఉంటే బాగుంటుందని అప్పటికప్పుడు సరికొత్త కథను డిజైన్ చేసినట్లుగా సమాచారం.


లీకైన సమాచారం ప్రకారం.. ఈ పాత్రకు నటుడు అర్జున్ దాస్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని అతనిని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ చేయవలసి ఉన్నది.. అర్జున్ దాస్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సీరియస్ రోల్స్ లో అతని పాత్ర ఒక గుర్తింపును తీసుకువస్తూ ఉంటుంది. ఖైదీ సినిమాతో పాపులర్ అయిన అర్జున్ దాస్ ఆ తర్వాత తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. మరి గుంటూరు కారం , పుష్ప-2 లో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Latest News
 
'రాయన్' కి సాలిడ్ బుకింగ్స్ Wed, Jul 24, 2024, 04:43 PM
ట్రేండింగ్ లో 'డబుల్ ఇస్మార్ట్' లోని మార్ ముంత చోడ్ చింత సాంగ్ Wed, Jul 24, 2024, 04:41 PM
'ధూమ్ ధామ్' నుండి టమాటో బుగ్గల పిల్ల సాంగ్ అవుట్ Wed, Jul 24, 2024, 04:35 PM
ఈ తేదీన ప్రకటించనున్న దుల్కర్ సల్మాన్ - పవన్ సాదినేని చిత్రం Wed, Jul 24, 2024, 04:27 PM
'ఆపరేషన్ రావణ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా స్టార్ డైరెక్టర్ Wed, Jul 24, 2024, 04:23 PM