షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి సనన్

by సూర్య | Wed, Jun 07, 2023, 02:05 PM

అప్పట్లో ప్రభాస్ మరియు కృతి సనన్ ప్రేమలో ఉన్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగిన విషయం తెలిసిందే.ఇక దానికి కొన్ని పరిణామాలు కూడా కారణమయ్యాయి. బేడియా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కృతి సనన్ వరుణ్ దావన్ మధ్య ఇటీవల ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఈ షో కి వీరిద్దరూ గెస్ట్లుగా రావడం జరిగింది. కరణ్ జోహార్ కూడా మధ్యలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే వరుణ్ ధావన్ ఒక కామెంట్ చేయడం జరిగింది. కృతి ఒకరి మనసులో ఉంది అని.. ప్రస్తుతం ఆయన ముంబైలో లేరు అని.. దీపికా పడుకునే తో పాటు వేరొక షూటింగ్లో ఉన్నాడని ..చెప్పుకొచ్చాడు.


అయితే.ఎవరు అనేది పేరు చెప్పకపోయినప్పటికీ ఆయన ప్రభాస్ ని ఉద్దేశించే ఈ కామెంట్స్ ని చేశారని భావిస్తున్నారు ఈ వార్త విన్నవందలందరూ .అయితే అదే సమయంలో ప్రభాస్ దీపిక పదుకొనే హైదరాబాద్ లో ప్రాజెక్ట్ కె షూటింగ్లో ఉన్నారు కాబట్టే వరుణ్ ధావన్ కృతి ప్రభాస్ ల గురించి అలా మాట్లాడాలని అందరూ అనుకున్నారు . వివాదాస్పద ఫిలిం క్రిటిక్ ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ పలుమార్లు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. అంతేకాదు త్వరలోనే మాల్దీవ్స్ లో కృతి ప్రభాస్ ల నిశ్చితార్థం కూడా కన్ఫర్మ్ అయింది అంటూ ఆయన చెప్పడం జరిగింది. అనంతరం వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ గురించి బాలీవుడ్ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది .


ఈ వార్తలు అన్నిటినీ ఖండించింది ఆమె. జూన్ 6న తిరుపతి వేదికగా ఆది పురుష్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇక ఈవెంట్ కి కృతి సనం ప్రభాస్ ఇద్దరు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే కృతి ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేయడం జరిగింది. ప్రభాస్ చాలా తక్కువ మాట్లాడుతారు అని అందరూ అంటుంటారు కానీ అది నిజం కాదు ఆయన చాలా వెలగలా మాట్లాడుతూ ఉంటారు చాలా స్వీట్ పర్సన్ దయగల వ్యక్తి భోజన ప్రియుడు ప్రభాస్ కళ్ళలో ఒక ప్రశాంతత కనబడుతుంది రాఘవుడి పాత్ర ఆయన చేసినంత గొప్పగా మరి ఎవరు చేయలేరు అంటూ ప్రభాస్ నీ పొగడ్తలతో ముంచెత్తింది కృతి. మరోసారి ఈ విధంగా కృతి ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది ..!!

Latest News
 
ఒకేసారి విడుదలకి సిద్దమౌతున్న 3 చిత్రాలు Tue, Sep 26, 2023, 01:26 PM
ఇందులో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ Tue, Sep 26, 2023, 01:16 PM
అందరికి ఈ సినిమా స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది Tue, Sep 26, 2023, 01:12 PM
మాకు తెలియకుండా విగ్రహం పెట్టారు Tue, Sep 26, 2023, 01:06 PM
విజయ్ దేవరకొండ​ సినిమా నుంచి శ్రీలీల ఔట్​ Tue, Sep 26, 2023, 12:35 PM