'బ్రో' మూవీ ఐటం సాంగ్ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

by సూర్య | Wed, Jun 07, 2023, 02:02 PM

 పవన్‌ కళ్యాణ్ మరియు సాయి ధరమ్‌ తేజ్ ముఖ్య పాత్రల్లో నటించిన బ్రో సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం ఇటీవల ఐటం సాంగ్ ను చిత్రీకరించారు అనే వార్తలు వచ్చాయి.యూనిట్‌ సభ్యుల నుండి స్పష్టత రావాల్సి ఉంది.పుకార్ల అనుసారం ఈ సినిమా యొక్క ఐటం సాంగ్ లో వాల్తేరు వీరయ్య సినిమా యొక్క ఐటం ఊర్వశి రౌతేలాను నటింపజేసినట్లుగా సమాచారం అందుతోంది. భారీ ఎత్తున ఈ ఐటం సాంగ్ కోసం ఖర్చు చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. కేవలం హీరోయిన్‌ కి గాను మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు అంటు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.


పవన్ మరియు సాయి ధరమ్‌ లు కలిసి ఈ ఐటం సాంగ్‌ లో కనిపించబోతున్నారు. ఐటం సాంగ్ తో సినిమా స్థాయిని మరింత పెంచే విధంగా థమన్‌ సంగీతాన్ని అందించాడు అంటున్నారు. మొత్తానికి సినిమా కోసం భారీగా ఖర్చు చేసి సినిమా యొక్క ఐటం సాంగ్ ను రూపొందించారు అంటూ వార్తలు వస్తున్నాయి. అన్ని విషయాలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తమిళ హిట్ మూవీ వినోదయ్య సీతమ్‌ కు ఇది రీమేక్‌. ఒరిజినల్ వర్షన్ దర్శకుడు సముద్ర ఖని తెలుగు లో కూడా దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.

Latest News
 
'కింగ్ అఫ్ కొత్త' 27 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:14 PM
'7/G బృందావన కాలని' రీ రిలీజ్ 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:11 PM
'బేబీ' డే వైస్ AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:08 PM
'మార్క్ ఆంటోని' 8 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:04 PM
పిల్లల ముఖాలను చూపించిన నయన్, విఘ్నేష్ Tue, Sep 26, 2023, 03:03 PM