షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో కొత్త చిత్రం

by సూర్య | Fri, Mar 31, 2023, 08:57 PM

కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఒక ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏప్రిల్ 21, 2023న విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

Latest News
 
Funky OTT: విశ్వక్ సేన్ కొత్త సినిమా ఓటీటీలో… స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sat, Feb 14, 2026, 10:05 PM
60 ఏళ్ల జగపతి బాబు ఫిట్‌నెస్ రహస్యం ఇదే! Sat, Feb 14, 2026, 07:16 PM
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అదుర్స్ 2 రాబోతోందా? Sat, Feb 14, 2026, 07:03 PM
‘విశ్వంభర’ గ్రాఫిక్స్‌పై చిరంజీవి అసంతృప్తి Sat, Feb 14, 2026, 04:08 PM
నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. Sat, Feb 14, 2026, 03:48 PM