by సూర్య | Fri, Mar 31, 2023, 08:54 PM
ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఈరోజు మూవీ మేకర్స్ పూజా హెగ్డే, విక్టరీ వెంకటేష్, భూమికా చావ్లా, సల్మాన్ ఖాన్ మరియు ఇతరులు నటించిన బతుకమ్మ ట్రాక్‌ను విడుదల చేశారు. చివర్లో కొన్ని హిందీ లిరిక్స్‌తో పూర్తిగా తెలుగులో ఉండడం ఈ సాంగ్ ప్రత్యేకత. ఈ పాట కొద్దిసేపటికే ఇయర్‌గాస్మ్‌గా మారింది. అంతేకాకుండా హిందీ సినిమాలో తెలుగు పాట కనిపించడం తెలుగువారికి ఆశ్చర్యం.
ఈ చిత్రంలో సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయిక. తమిళంలో సూపర్ హిట్ అయిన వీరమ్ చిత్రానికి ఈ సినిమా అధికారక రీమేక్. ఈ యాక్షన్ కామెడీ మూవీలో జగపతి బాబు మరియు ఇతరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిమేష్ రేష్మియా, రవి బస్రూర్, సుఖ్బీర్ సింగ్, దేవి శ్రీ ప్రసాద్, సాజిద్ ఖాన్, పాయల్ దేవ్ మరియు అమల్ మాలిక్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఏప్రిల్ 21, 2023న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.