ఇటలీలో 'సాలార్' యాక్షన్ సీక్వెన్స్

by సూర్య | Sat, Mar 25, 2023, 08:19 PM

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఇటలీలోని కొన్ని లొకేషన్లలోని బంగ్లాలో మూవీ మేకర్స్ ప్రభాస్‌పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ యాక్షన్ బ్లాక్స్ ప్రభాస్ హీరోయిజాన్ని మరో స్థాయికి ఎలివేట్ చేయనున్నట్లు లేటెస్ట్ టాక్.

 అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న సాలార్ చిత్రం సెప్టెంబరు 28, 2023న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ మేకర్స్ ఎటువంటి పాటలు లేకుండా ఇంగ్లీష్ వెర్షన్‌ను విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.

Latest News
 
నిఖిల్ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్ Thu, Jun 01, 2023, 08:54 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' హిందీ వెర్షన్ Thu, Jun 01, 2023, 08:54 PM
USAలో 'ఇండియన్ 2' తదుపరి షెడ్యూల్ Thu, Jun 01, 2023, 08:51 PM
'2018' 5 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Jun 01, 2023, 07:00 PM
రేపే 'ఉగ్రం' డిజిటల్ ఎంట్రీ Thu, Jun 01, 2023, 06:50 PM