మనోజ్ పెళ్లిపై ఓపెన్ ఐన మోహన్ బాబు

by సూర్య | Thu, Mar 23, 2023, 06:07 PM

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి రెండవ తనయుడు, హీరో మనోజ్ ఈమధ్యనే భూమా నాగమౌనికని రెండవ వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ రెండో వివాహం కావడంతో ఈ వార్త హాట్ టాపిక్ గా నిలిచింది. ఐతే, మనోజ్ మౌనికని పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి ఇష్టం లేదని ఆ సమయంలో కొన్ని వార్తలు షికార్లు చేసాయి.


తాజాగా ఈ వార్తలపై మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. మనోజ్ వచ్చి పెళ్లి విషయం తనకు చెప్పినప్పుడు మరోసారి ఆలోచించమన్నానని, తను తీసుకున్న నిర్ణయం సరైనదేనని మనోజ్ కి నమ్మకం ఉండడంతో పెళ్ళికి అంగీకరించానని మోహన్ బాబు చెప్పారు. అంతేకాని, ఈ విషయంలో ఎవరో ఏదో రాసారని, ఎవరో ఏదో అన్నారని పట్టించుకుంటూ కూర్చుంటే నన్ను నేను మరిచిపోతాను. ఏనుగు వెళుతుంటే కుక్కలెన్నో మొరుగుతాయి ..మొరగనీ .. వాళ్లిద్దరూ సుఖంగా ఉన్నారు..అంతే చాలు.. అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM