రమ్యకృష్ణతో పని చెయ్యాలంటే భయపడ్డాను - కృష్ణవంశీ

by సూర్య | Thu, Mar 23, 2023, 06:02 PM

చాన్నాళ్ల తరవాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ "రంగమార్తాండ" తో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. ఆయన దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్,  రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించారు. ఉగాది కానుకగా నిన్న విడుదలైన ఈ సినిమా ఆడియన్స్, క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలు అందుకుంటుంది.


తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ ఈ సినిమాలో రమ్యకృష్ణతో పనిచెయ్యడంపై తన అనుభవాన్ని పంచుకున్నారు. రమ్యకృష్ణతో పెళ్ళికి ముందు చంద్రలేఖ చేశాను.. మళ్ళీ ఇన్నాళ్ళకు రంగమార్తాండ చేశాను. రమ్యకృష్ణతో చేసేటప్పుడు కొంత భయపడ్డాను. ముందుగా ఈ సినిమాలో ఆ పాత్రకు ఎవరెవరినో అనుకున్నాను కానీ, రమ్యకృష్ణ తాను చేస్తానంటూ స్వయంగా వచ్చింది. ఈ సినిమాలో ఆ పాత్రకు డైలాగులు తక్కువ, కళ్ళతో అభినయించాలి.. అని చెప్పినా చేస్తాను అంటూ ముందుకు వచ్చింది... అని కృష్ణవంశీ పేర్కొన్నారు.

Latest News
 
కార్తీ తదుపరి చిత్రంలో ప్రముఖ హీరో కీలక పాత్ర Fri, Jun 02, 2023, 08:56 PM
OTT ప్లాట్‌ఫారమ్‌ను లాక్ చేసిన 'పరేషన్' Fri, Jun 02, 2023, 08:54 PM
'మేమ్ ఫేమస్' 7 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 07:00 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఉగ్రం' Fri, Jun 02, 2023, 06:51 PM
'బిచ్చగాడు 2' 13 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:42 PM