by సూర్య | Fri, Mar 17, 2023, 07:00 PM
హర్ష పులిపాక దర్శకత్వంలో వస్తున్న 'పంచతంత్రం' సినిమాలో బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ అండ్ నరేష్ అగస్త్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అఖిలేష్ వర్ధన్ అండ్ సృజన్ యరబోలు ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 2022లో థియేటర్లలో విడుదలైంది మరియు వీక్షకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంది.
తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం ఈటీవీ విన్‌లో మార్చి 22, 2023 నుండి ETV విన్ యాప్/వెబ్‌సైట్‌లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఎస్ ఒరిజినల్స్ అండ్ టికెట్ ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.
Latest News