![]() |
![]() |
by సూర్య | Fri, Feb 03, 2023, 07:00 PM
మాస్ రాజా రవితేజ రీసెంట్ బ్లాక్ బస్టర్ "ధమాకా" రచయిత ప్రసన్న కుమార్ బెజవాడతో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున నెక్స్ట్ మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో రూపొందబోతున్న ప్రాజెక్ట్ యొక్క జానర్ పై లేటెస్ట్ గా ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది.
అదేంటంటే, ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో నాగార్జున నటించబోయే సినిమా ఒక పీరియడ్ డ్రామా అని, 70,80ల కాలంలో నడిచే కథ అని టాక్. పోతే, ఈ సినిమాలో నాగ్ వీరాభిమాని అల్లరి నరేష్ ఒక ప్రత్యేక పాత్రలో నటించబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది.
మరి, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి నిజానిజాలు తెలియాలంటే, అఫీషియల్ కన్ఫర్మేషన్ రావలసిందే. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ..!!
Latest News