మరికొన్ని గంటల్లోనే 'బుట్టబొమ్మ' USA ప్రీమియర్స్

by సూర్య | Fri, Feb 03, 2023, 06:50 PM

"బుట్టబొమ్మ"తో చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వంలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమాలో అర్జున్ రామ్ దాస్, సూర్య వసిష్ఠ, నవ్య స్వామి కీరోల్స్ లో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
మలయాళ సూపర్ హిట్ మూవీ "కప్పేల" కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగులో రేపే విడుదల కావడానికి సిద్ధమయ్యింది. ఈనేపథ్యంలో మరికొన్ని గంటల్లోనే బుట్టబొమ్మ USA ప్రీమియర్స్ జరగనున్నాయని తెలుస్తుంది. ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ బుట్టబొమ్మను ఓవర్సీస్ లో గ్రాండ్ గా విడుదల చెయ్యనుంది.

Latest News
 
'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్ Tue, May 21, 2024, 08:45 PM
తన సినీ కెరీర్‌ను వదిలేయనున్న స్టార్ హీరోయిన్ Tue, May 21, 2024, 08:43 PM
'రత్నం' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే...! Tue, May 21, 2024, 08:41 PM
త్వరలో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్న 'యక్షిణి' Tue, May 21, 2024, 08:37 PM
క్రేజీ బ్యాక్‌డ్రాప్‌లో అల్లు అర్జున్ 'పుష్ప 2' షూటింగ్ Tue, May 21, 2024, 06:51 PM