టాలీవుడ్ సీనియర్ దర్శకుడు మృతి..!!

by సూర్య | Thu, Feb 02, 2023, 09:54 AM

సీనియర్ నటీమణి జమున గారి మరణం టాలీవుడ్ ప్రేక్షకులు ఇంకా జీర్ణించుకోక ముందే మరొక సీనియర్ దర్శకుడి మరణ వార్త తీవ్రంగా కలచివేస్తుంది. తెలుగు చలనచిత్ర సీమలో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విద్యాసాగర్ రెడ్డి అకా సాగర్ ఈ రోజు తెల్లవారుఝామున చెన్నైలోని స్వగృహంలో కాలం చేసారు. ఆయన వయస్సు 70. వయసురీత్యా వచ్చే అనారోగ్య కారణాల వల్ల సాగర్ మరణించినట్టుగా తెలుస్తుంది.


సూపర్ స్టార్ కృష్ణ గారితో 'అమ్మ దొంగ' వంటి సూపర్ హిట్ రూపొందించి, ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. సూపర్ హిట్ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఈయన వద్దనే శిష్యరికం చేసారు. తెలుగు ఫిలిం అసోసియేషన్ కు అధ్యక్ష పదవిలో  కూడా సాగర్ కొన్నాళ్ళు కొనసాగారు.

Latest News
 
వరుణ్ సందేశ్ 'నిందా' ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ Mon, May 13, 2024, 09:28 PM
తలపతి 69లో మహేష్ బాబు, SRK మరియు మమ్ముట్టిని నటింపజేయాలని కోరుకుంటున్న- నెల్సన్ దిలీప్‌కుమార్ Mon, May 13, 2024, 09:26 PM
'కన్నప్ప' లో ప్రభాస్ పాత్ర గురించి ఓపెన్ అయ్యిన విష్ణు మంచు Mon, May 13, 2024, 09:12 PM
ఎన్టీ రామారావుకు భారతరత్న కోసం మద్దతు తెలిపిన మెగా స్టార్ Mon, May 13, 2024, 09:07 PM
2.3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'టర్బో' ట్రైలర్ Mon, May 13, 2024, 08:58 PM