'తళపతి 67' ఈ తేదీన విడుదల కానుందా?

by సూర్య | Mon, Jan 30, 2023, 04:42 PM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తన తదుపరి సినిమాని తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో ఈ సినిమా గురించి వ‌రుస అప్‌డేట్‌లు వ‌స్తాయ‌ని ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో లోకేష్ హింట్ ఇచ్చారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం అక్టోబర్ 19, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఫిబ్రవరి 3, 2023న ఒక వీడియో గ్లింప్సె తో పాటు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని సమాచారం.

ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
ట్రెండీ అవుట్ ఫిట్ లో హనీ రోజ్ Tue, Apr 30, 2024, 10:54 AM
ఘాటుగా స్పందించిన తెలుగు హీరోయిన్ Tue, Apr 30, 2024, 10:37 AM
'దేవర' సినిమాపై క్లారిటీ ఇచ్చిన అల్ల‌రి నరేష్ Tue, Apr 30, 2024, 10:15 AM
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM