వాయిదాపడిన 'ఎన్నో రాత్రులొస్తాయి' సాంగ్ రిలీజ్..!!

by సూర్య | Sat, Jan 28, 2023, 02:12 PM

నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న చిత్రం "అమిగోస్". అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.


నిన్న సాయంత్రం ఈ సినిమా నుండి రొమాంటిక్ 'ఎన్నో రాత్రులొస్తాయి' సాంగ్ ప్రోమో విడుదలైంది. పూర్తి పాట జనవరి 29 సాయంత్రం 05:09నిమిషాలకు విడుదల కాబోతుంది. ఐతే, తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ వేరే డేట్ కు షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తుంది. నందమూరి తారకరత్న గారి హెల్త్ కండిషన్ ను దృష్టిలో ఉంచుకుని ఈ సాంగ్ విడుదల ను వాయిదా వేస్తున్నట్టు కాసేపటి క్రితమే మేకర్స్ ప్రత్యేక నోట్ విడుదల చేసారు. ఈ సందర్భంగా తారకరత్న గారు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని మేకర్స్ దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM